News August 12, 2025

వర్షాల ఎఫెక్ట్.. రామన్న కతువకు జలకళ!

image

రాచర్ల మండలం చిన్నగానపల్లె గ్రామంలో గల రామన్నకతువ జలకళను సంతరించుకుంది. ఇటీవల జోరు వర్షాలు కురుస్తుండగా, రాత్రి కూడా వర్షం కురవడంతో రామన్న కతువకు వరద నీరు చేరింది. రామన్న కతువతో పాటు రాచర్ల మండలంలోని పలు గ్రామాల చెరువులకు వరద నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ నీటి ప్రవాహం కంభం చెరువుకు సైతం చేరుతుండగా వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు తప్పినట్లుగా చెప్పవచ్చు.

Similar News

News September 10, 2025

ఒంగోలు: బడి ఈడు పిల్లలు బడికి వెళ్లేలా చూడాలి

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా ప్రైవేటు లేదా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య అభ్యసించాలని అన్నారు. మంగళవారం ఒంగోలు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ‘లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులపై మాట్లాడారు. జిల్లా అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.

News September 9, 2025

ప్రకాశంకు 3 రోజులు వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

image

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA ప్రకటించింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది. గత 3 రోజులుగా తీవ్ర వేడిమిలో బాధపడుతున్న ప్రజలకు ఇది చల్లని కబురు. అయితే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News September 9, 2025

ప్రకాశం: బాలింత మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం!

image

మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో MDR సమావేశం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ 3 నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందింది. ఆమె మృతిపై విచారణ చేసి నివేదిక అందజేయాలన్నారు.