News August 12, 2025
KNR: కుక్క కాటుకు ‘సుప్రీం దెబ్బ’!

2నెలల్లో ఢిల్లీలో ఒక్క వీధికుక్క కూడా కన్పించొద్దనే సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు. అయితే ఈ తరహా నిర్ణయాన్ని ఉమ్మడి KNRలోనూ అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కుక్కకాటు(రేబిస్)కు గురై అనేకమంది ముఖ్యంగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే మన దగ్గరా అలాంటి రూల్‌ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. మరి దీనిపై మీ COMMENT.
Similar News
News April 16, 2026
రేపు కేయూలో “ఆయితెర–2026” ప్రారంభం

కాకతీయ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ స్థాయి వార్షికోత్సవం “ఆయితెర–2026” ను ఏప్రిల్ 17 నుంచి 19 వరకు టెక్నికల్, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, ఫెస్ట్ అధ్యక్షుడు ఆచార్య ఎన్. రమణ తెలిపారు. ఈ ఫెస్ట్ ప్రారంభ కార్యక్రమం ఏప్రిల్ 17న ఉదయం 10:30 గంటలకు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు.
News April 16, 2026
NZB: రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే!

గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 43.5°Cల ఉష్ణోగ్రత నమోదు కాగా కామారెడ్డి జిల్లా మేనూర్‌లో 43.4°Cల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎండ వేడి తాళలేక సతమతమవుతున్నారు. రోజంతా ఉక్కపోత భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వారం పాటు ఇలాగే ఉష్ణోగ్రతలు కొనసాగే వీలుందని అధికారులు తెలిపారు.
News April 16, 2026
WGL: వైద్య విద్యార్థుల పరీక్షలో లోపభూయిష్ఠం..!

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో MBBS ఫైనల్ ఇయర్ పేపర్-1 పరీక్ష నిన్న జరిగింది. ఇందులో పేపర్-2లో రావాల్సిన ప్రశ్నలు వచ్చాయి. 5 వేల మంది ప్రశ్నించడంతో యూనివర్సిటీ అధికారులు 15న పరీక్ష రద్దు చేస్తున్నామని, తిరిగి ఈనెల 27న నిర్వహిస్తామని వెబ్ నోట్ పోస్ట్ చేశారు. అయితే టెక్నికల్ సమస్య అని వారు చెప్పడం గమనార్హం. అధికారులు నిత్యం ఇలాంటి తప్పులు చేస్తున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.


