News August 12, 2025

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ HYDలో 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.880 తగ్గి రూ.1,01,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.800 పతనమై రూ.92,950 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.2 వేలు తగ్గి రూ.1,25,000కు చేరింది. కాగా రెండు రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.1,640, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.1500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News August 12, 2025

హైదరాబాద్ మెట్రోకు నిరాశ

image

హైదరాబాద్ మెట్రోకు కేంద్ర క్యాబినెట్ మరోసారి మొండిచేయి చూపింది. ఇవాళ్టి సమావేశంలో బెంగళూరు, థాణె, పుణే, ఢిల్లీ, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు రూ.1.09 లక్షల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతించింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-3పై ప్రకటనేమీ లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYD రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిందని, మెట్రో నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతున్నారు.

News August 12, 2025

ChatGPT సలహా ప్రాణం మీదకొచ్చింది!

image

డైట్ ప్లాన్ కోసం ChatGPTని వాడిన 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. టేబుల్ సాల్ట్‌కు బదులు సోడియం బ్రోమైడ్ తీసుకోవాలని సూచించడంతో అతను 3 నెలలుగా దీనిని వాడుతున్నాడు. ఇది విషంగా మారడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని, తీవ్రదాహం, పట్టుకోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

News August 12, 2025

మోదీ జీ.. ట్రాఫిక్ నుంచి కాపాడాలంటూ చిన్నారి లేఖ

image

బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసిందో ఐదేళ్ల చిన్నారి. ‘నరేంద్ర మోదీ జీ. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము పాఠశాలలకు, ఆఫీసులకు లేటుగా వెళ్తున్నాం. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అని లేఖలో రాసింది. ఈ ఫొటోను ఆ చిన్నారి తండ్రి ట్విటర్‌లో షేర్ చేయగా వైరలవుతోంది. ఇక్కడ పీక్ టైమ్‌లో KM ప్రయాణించేందుకు గంట పడుతుందని చెబుతుంటారు.