News August 12, 2025

యాదాద్రిలో ఈ నెల 15న ఉచిత వరలక్ష్మీ వ్రతం

image

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 15న శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావు తెలిపారు. వ్రతంలో పాల్గొనే మహిళా భక్తులు రేపు సాయంత్రం 5 గంటలలోపు కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండప కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 19, 2026

ఆ ఊళ్లో హనుమంతుడి పేరెత్తరు..

image

ఉత్తరాఖండ్‌ ద్రోణగిరిలో హనుమంతుడిని పూజించరు. రామాయణ కాలంలో లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని కోసం వచ్చిన హనుమంతుడు ఇక్కడి పర్వతాన్ని తీసుకెళ్లారని గ్రామస్థుల నమ్మకం. గ్రామదేవత అనుమతి లేకుండా కొండను తీసుకెళ్లడంతో తమ ఆరాధ్య దైవానికి అవమానం జరిగిందని వారు భావిస్తారు. అందుకే ఈ ఊరిలో హనుమంతుడి గుళ్లు, జెండాలు కనిపించవు. అయితే వారికి హనుమపై ద్వేషం లేదు. కానీ అనుమతి అడగకపోవడం సరైనది కాదని నమ్ముతారు.

News April 19, 2026

కేటీఆర్ వీరాభిమాని ‘తెలంగాణ సత్తెమ్మ’ కన్నుమూత

image

తంగళ్ళపల్లి మండలం చీర్లవంచకు చెందిన తెలంగాణ ఉద్యమకారిణి సత్తెమ్మ అనారోగ్యంతో కరీంనగర్‌లో మృతి చెందారు. 2009 నుంచి కేటీఆర్‌కు వీరాభిమానిగా ఉన్న ఆమెకు, మధ్యమానేరు ముంపు తర్వాత కేటీఆర్ రగుడులో డబుల్ బెడ్‌రూం ఇచ్చి అండగా నిలిచారు. కొడుకు మరణంతో మనోవేదనలో ఉన్న ఆమె మృతితో విషాదం నెలకొంది. వేములవాడ అగ్రహారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అంత్యక్రియలు జరగనున్నాయి.

News April 19, 2026

కర్నూలు జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానం, సెకండియర్‌లో ఎనిమిదో స్థానం నిలిచిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో 22,477 మందికి 16,356 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 18,999 మందికి 16,077 మంది పాసయ్యారు. 2,922 మంది ఫెయిలయ్యారు. సెకండియర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.