News August 12, 2025
మేడ్చల్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జాతీయ రహదారి 44పై జరిగింది. మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం ఎదురుగా మేడ్చల్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ కిందపడి ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2026
1 Min లేటైనా CETకు అనుమతి లేదు

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.
News April 18, 2026
సంతమాగులూరులో కుళ్లిన మృతకళేబరం కలకలం

సంతమాగులూరు మండలంలోని కొప్పరం నుంచి సజ్జాపురం వెళ్లే మార్గంలో ఉన్న చెరువులో కుళ్లిన కళేబరం శుక్రవారం కలకలం రేపింది. ఎముకుల గూడుతో ఉన్న డెడ్‌బాడీని పశువుల కాపరి చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. దీనిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 18, 2026
మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!


