News August 12, 2025

Rain Alert: HYDలో ఉద్యోగులకు సూచన

image

నగర వ్యాప్తంగా నేడు సాయంత్రం భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపినట్లు CYB పోలీసులు గుర్తు చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని(WFH) చేసేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని సూచించారు.
SHARE IT

Similar News

News September 14, 2025

HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

image

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్‌కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్‌ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.

News September 14, 2025

JNTUలో పార్ట్ టైం PhD కోసం ప్రవేశ పరీక్షలు

image

జేఎన్టీయూ యూనివర్సిటీలో పార్ట్ టైం PhD కోసం పరీక్షలు జరుగుతున్నాయి. నేడు ఉదయం కంప్యూటర్ సైన్స్‌ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం మెకానికల్ తోపాటు EEE విభాగంలోని కోర్సులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు వెల్లడించారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News September 14, 2025

HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

image

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.