News August 12, 2025

Rain Alert: HYDలో ఉద్యోగులకు సూచన

image

నగర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపినట్లు CYB పోలీసులు గుర్తు చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ పోలీసులు పేర్కొన్నారు. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని(WFH) చేసేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.
SHARE IT

Similar News

News April 18, 2026

TCS ఘటన ‘కార్పొరేట్ జిహాద్’: మహారాష్ట్ర సీఎం

image

TCS నాసిక్‌ క్యాంపస్‌‌లో <<19663286>>మత మార్పిడి<<>> వ్యవహారం జిహాద్‌ లాంటిదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ‘ఈ జిహాద్‌ను మేం వివిధ రూపాల్లో చూశాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వచ్చాయి. వాటి కంటే ఈ కార్పొరేట్ జిహాద్ ఇంకా తీవ్రమైనది. ఇది ఓ కంపెనీ ఆఫీసులోనే జరిగిందా? లేక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News April 18, 2026

సత్యసాయి: కార్లు అద్దెకు తీసుకుని మోసం.. నిందితుడి అరెస్ట్

image

కార్లను బాడుగకు తీసుకుని, యజమానులకు తెలియకుండా కుదువ పెట్టి మోసం చేసిన అన్నవరం గౌతం రాజును సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానులను నమ్మించి మూడు కార్లు తీసుకుని, వాటిని ఇతరుల వద్ద కుదువ పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

News April 18, 2026

‘5 రాష్ట్రాలు దాటి వచ్చారా?’.. అల్లు అర్జున్ పిటిషన్‌పై ఢిల్లీ HC

image

తన పర్సనాలిటీ రైట్స్ పరిరక్షించాలని అల్లు అర్జున్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ HC ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీ, TGకి మధ్య 5 రాష్ట్రాలున్నాయి. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు’ అని జస్టిస్ తుషార్ రావు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాది స్పందిస్తూ.. హక్కుల ఉల్లంఘన దేశమంతటా జరుగుతోందని, అందుకే రావాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో బన్నీ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని జడ్జి ఆదేశాలిచ్చారు.