News March 31, 2024
తండ్రి కాబోతున్న భారత స్టార్ క్రికెటర్?

భారత స్టార్ క్రికెటర్ KL రాహుల్, నటి అతియా శెట్టి(సునీల్ కుమార్తె) తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. ‘డాన్స్ దీవానే’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘వచ్చే సీజన్‌లో నేను తాతలాగా వేదికపై నడుస్తాను’ అని తాతయ్యల స్పెషల్ ఎపిసోడ్‌లో సునీల్ శెట్టి అనడంతో ఈ ప్రచారం మొదలైంది. కాగా 2023 జనవరిలో రాహుల్-అతియా పెళ్లైంది.
Similar News
News March 15, 2026
చంద్రబాబుకు అల్లు అర్జున్ థాంక్స్

AP సీఎం చంద్రబాబు నాయుడికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. శిరీష్, నయనిక దంపతులను <<19384357>>ఆశీర్వదించడానికి<<>> శనివారం అల్లు ఇంటికి చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో విదేశాల్లో ఉన్న ఐకాన్ స్టార్.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన Xలో పోస్ట్ చేసి సీఎంకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.
News March 15, 2026
సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.
News March 15, 2026
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా?

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు, మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణంపై వాడీవేడి చర్చలకు ఆస్కారం ఉంది. సభకు KCR హాజరవడంపై క్లారిటీ లేదు. గతంలో సమావేశాల తొలి రోజున మాత్రమే BRS చీఫ్ హాజరయ్యేవారు.


