News August 12, 2025

బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసు

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి BRS నేత KTR లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తన పరువుకు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలు, ప్రస్తుత CM, మాజీ సీఎం KCR కూతురు, అల్లుడు సహా వేలాది మంది ఫోన్లను KTR ట్యాప్ చేయించారంటూ సంజయ్ ఆరోపించారని నోటీస్‌లో మెన్షన్ చేశారు. వారంలోగా క్షమాపణలు చెప్పకపోయినా, మళ్లీ ఆరోపణలు చేసినా లీగల్‌ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News August 12, 2025

బీఆర్ఎస్ బీసీ సభ వాయిదా

image

TG: ఈనెల 14న కరీంనగర్‌లో BRS నిర్వహించతలపెట్టిన బీసీ సభ వాయిదా పడింది. అల్పపీడనం కారణంగా 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.

News August 12, 2025

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

AP: 3 శాఖల్లో 21 ఉద్యోగాలకు APPSC <>నోటిఫికేషన్ <<>>ఇచ్చింది. వ్యయసాయ శాఖలో 10 ఉద్యోగాలకు ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేవాదాయ శాఖలో 7 EO ఉద్యోగాలకు ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు, గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్‌లో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రేపటి నుంచి సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

News August 12, 2025

చిన్న మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది!

image

ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే పెద్ద హీరోలతో ₹వందల కోట్లు వెచ్చించి సినిమా తీసి, టికెట్ ధరలు పెంచుకున్నా ₹200 కోట్లు రాబట్టడం గగనమైపోతోంది. అలాంటిది ఏ హడావిడి లేకుండా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని ₹15కోట్లతో రూపొందించగా ఇప్పటికే ₹225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. క్వాలిటీ ప్రజెంటేషన్ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుందని ఇది నిరూపించింది.