News August 12, 2025
అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్!

అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత బిలియనీర్ ముకేశ్ అంబానీని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడి చేస్తే గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీని పేల్చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఖురాన్‌లోని ఓ వాక్యాన్ని ఉదహరిస్తూ అంబానీ ఫొటో చూపిస్తూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా మునీర్ బెదిరింపులకు భయపడేది లేదని ఇప్పటికే భారత్ స్ట్రాంగ్ <<17370414>>కౌంటర్<<>> ఇచ్చింది.
Similar News
News August 12, 2025
బీఆర్ఎస్ బీసీ సభ వాయిదా

TG: ఈనెల 14న కరీంనగర్‌లో BRS నిర్వహించతలపెట్టిన బీసీ సభ వాయిదా పడింది. అల్పపీడనం కారణంగా 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.
News August 12, 2025
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: 3 శాఖల్లో 21 ఉద్యోగాలకు APPSC <
News August 12, 2025
చిన్న మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది!

ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే పెద్ద హీరోలతో ₹వందల కోట్లు వెచ్చించి సినిమా తీసి, టికెట్ ధరలు పెంచుకున్నా ₹200 కోట్లు రాబట్టడం గగనమైపోతోంది. అలాంటిది ఏ హడావిడి లేకుండా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని ₹15కోట్లతో రూపొందించగా ఇప్పటికే ₹225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. క్వాలిటీ ప్రజెంటేషన్ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుందని ఇది నిరూపించింది.