News August 12, 2025
పోచారం ప్రాజెక్ట్ నీటిమట్టం ఆప్డేట్

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం ఉదయం 20 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. ప్రాజెక్ట్ నిండుకోవడంతో పర్యాటకుల సందడి నెలకొంది.
Similar News
News September 8, 2025
ధనూర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలోని ధనూర గ్రామంలో పలువురు లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
News September 8, 2025
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి దామోదర్

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటనకు రాగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవి స్వాగతం పలికారు. బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక నాయకులు రమేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News September 8, 2025
మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం
చేగుంటలో యూరియా కోసం కోసం రైతులు రోడ్డు ఎక్కారు. గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రామయంపేట పీఏసీఎస్ వద్ద క్యూ లైన్ లో రైతులు చెప్పులు పెట్టారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు, నర్సాపూర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.