News August 12, 2025
సహాయక చర్యలో వరంగల్ పోలీసులు..!

వరంగల్ నగర పరిధిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు కాలనీలు అతలాకుతలలంగా మారాయి. నీట మునిగిన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సీఐ రమేష్ ఆధ్వర్యంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, 24 గంటలు అందుబాటులో ఉంటామని చెబుతున్నారు.
Similar News
News April 17, 2026
‘కాళేశ్వరం’పై ఎలాంటి దురుద్దేశమూ లేదు: మంత్రి

TG: ₹97,000CRతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకురావాలా అని ఆలోచనలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘కాళేశ్వరం నిర్మాణంలో BRS చేసిన తప్పిదాలు ప్రజలకు తెలుసు. ఈ ప్రాజెక్టుపై మాకెలాంటి దురుద్దేశమూ లేదు. గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తిచేయాలని నిర్ణయించాం’ అని వివరించారు. NDSA ఛైర్మన్‌తో వీటిపై చర్చించామని తెలిపారు.
News April 17, 2026
వరి కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం

సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో రబీ సీజన్ వరి కొనుగోలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ప్రతినిధులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు పారదర్శకంగా తూకం వేసి, ప్రతి గింజను కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు నిర్ణీత సమయంలో చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
News April 17, 2026
బాంబు కాదు: ఉప్పల్ మెట్రో స్టేషన్ చెత్త డబ్బాలో టపాసులు: పోలీసులు

ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు బెదిరింపు వార్తలపై పోలీసులు స్పందించారు. చెత్త డబ్బాలో టపాసులు ఉన్నట్లు గమనించిన సిబ్బంది మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై PSకు కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెట్రో స్టేషన్‌ను తనిఖీ చేయగా, అవి వేడుకల్లో వాడే టపాకాయలని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.


