News August 12, 2025
రాచర్ల: బాలిక సేఫ్.. కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

రాచర్ల మండలం అనుమలవీడులోని పాఠశాల వద్ద ఇవాళ ఉదయం ఓ బాలిక కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. పాఠశాల వద్దకు వచ్చిన దుండగులు కారులో బాలికను ఎత్తుకెళ్లారు. బాలిక తల్లి సీఐ రామకోటయ్య, ఎస్సై కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు సైతం గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసుల భయంతో దేవరాజు గట్టు వద్ద బాలికను దుండగులు వదిలిపెట్టి పారిపోయారు.
Similar News
News April 18, 2026
పొదిలిలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా

పొదిలికి చెందిన కొదమల నాగరాజు అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్త మరొక యువతితో సంబంధం పెట్టుకుని తనని వేధిస్తున్నాడని దీంతో పుట్టింటికి వెళ్లానని భార్య తెలిపింది. భర్తలో మార్పు రాకపోతుందా అని తాను ఇంటికి రాగా.. మామ అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించింది. దీంతో ఆమె పిల్లలతో ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసింది.
News April 18, 2026
ఒంగోలు: మూడు జిల్లాల దొంగ అరెస్ట్

ప్రకాశం, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మల్లి రెడ్డి నరేంద్రరెడ్డి(27)ని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విజయ్ కృష్ణ, ఎస్ఐ హరిబాబు బృందం నిందితుడిని పట్టుకుని అతని నుంచి 110 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది. నరసరావుపేటలో తాకట్టు పెట్టిన బంగారం స్లిప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు.
News April 18, 2026
ప్రకాశం: రైతుల కోసం బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశాలు

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.


