News August 12, 2025
పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయం: టీడీపీ

AP: 30 ఏళ్లుగా పులివెందులలో ఏ ఎన్నిక వచ్చినా వేరే వాళ్లు నామినేషన్స్ వేయకుండా బెదిరించి ఏకగ్రీవం చేసుకునేవాళ్లని టీడీపీ విమర్శించింది. ఈ సారి ఏకంగా 11 మంది నామినేషన్స్ వేయడంతో ఆ చోట ఎన్నికలు వచ్చాయని Xలో తెలిపింది. కూటమి ప్రభుత్వం కారణంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయమని పేర్కొంది.
Similar News
News January 30, 2026
NZB: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

NZB జిల్లాలో రెండు రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతల హామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.
News January 30, 2026
కొబ్బరి మొక్కల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 30, 2026
భారీగా తగ్గిన బంగారం ధర

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.7,550 పతనమై రూ.1,56,400 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


