News August 12, 2025

ASF: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు: ఎస్పీ

image

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావద్దని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టవద్దన్నారు. ఎవరో చెప్పారని లేదా సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోవద్దని అన్నారు. లోన్స్ యాప్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 19, 2026

హనుమకొండ డీవైఎస్ఓగా ప్రశాంత్

image

హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జ్ యువజన, క్రీడల శాఖ అధికారిగా ప్రశాంత్‌ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ అండ్ ఎండీ సోనీబాలాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీవైఎస్ఓగా ఇక్కడ పని చేసిన గుగులోత్ అశోక్ కుమార్ డీడీగా పదోన్నతి పొంది హైదరాబాద్ వెళ్లారు. ప్రశాంత్ గతంలో కరీంనగర్, హనుమకొండ డీఎస్ఏలో బాస్కెట్ బాల్ కోచ్‌గా పని చేశారు.

News April 19, 2026

తిరుపతి: ‘నేను ప్రేమించా.. ఆమె మోసం చేసింది’

image

ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి కావడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిరుపతి వెస్ట్ పోలీసుల వివరాల మేరకు.. గంగవరం(M) వేమనపల్లెకు చెందిన మహేంద్ర(20) బీకాం చదువుతూ వెంకటరమణ లే అవుట్‌లో ఉంటున్నాడు. మహేంద్ర ఓ యువతిని ప్రేమించగా ఆమెకు వారం క్రితం పెళ్లయింది. దీంతో ‘నేను సూసైడ్ చేసుకుంటున్నా. నేను అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆమె మోసం చేసింది’ అని వాట్సాప్ మెసేజ్ పంపి సూసైడ్ చేసుకున్నాడు.

News April 19, 2026

పోలీసు వాహనాల విడిభాగాలకు బహిరంగ వేలం: ఎస్పీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీస్ శాఖ మోటారు ట్రాన్స్‌పోర్టు (ఎంటీ) కార్యాలయం వద్ద ఈ నెల 21న పాత విడిభాగాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. వాహనాల మరమ్మతుల అనంతరం తొలగించిన విడిభాగాలకు ఆ రోజు ఉదయం 10 గంటలకు వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తి గల బిడ్డర్లు నిర్ణీత సమయానికి ఎంటీ కార్యాలయానికి చేరుకుని వేలంలో పాల్గొనాలని ఎస్పీ సూచించారు.