News August 12, 2025
కుక్కలను తరలించడం అమానవీయం: రాహుల్

ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు <<17368812>>ఆదేశాలపై<<>> LoP రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇది అమానవీయం. సైన్స్ ఆధారిత విధానానికి విరుద్ధం. ఏరివేయడానికి నోరు లేని జీవులేం సమస్యలు కావు. క్రూరత్వానికి తావులేకుండా షెల్టర్లు, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, కమ్యూనిటీ కేర్ వంటి పద్ధతులతో వీధులను సేఫ్‌గా మార్చొచ్చు. పబ్లిక్ సేఫ్టీ, యానిమల్ వెల్ఫేర్ రెండూ సాధ్యమే’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 19, 2026
IPLలో నేడు హోరాహోరీ పోరు

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్‌లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్‌లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
News April 19, 2026
భారత్‌తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.
News April 19, 2026
చదువు ప్రాధాన్యం తెలుసుకోండి!

విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: అందమైన హంసలతో కలిసి తిరిగినంత మాత్రాన కొంగ ఎప్పటికీ హంస కాలేదు. అలాగే చదువు రానివాడు, నేర్చుకోవాలనే కుతూహలం లేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నప్పటికీ పండితుడు కాలేడు. అందుకే ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>


