News March 31, 2024

మల్లాపూర్: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News February 2, 2026

కరీంనగర్ ‘పుర’పోరు.. మేయర్ పీఠంపై ముమ్మర వ్యూహాలు

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలన్నీ మేయర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ BC జనరల్‌కు రిజర్వ కావడంతో హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తన అధికార బలాన్ని, BRS తన పట్టును, BJP ఎంపీ చరిష్మాను నమ్ముకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.

News February 2, 2026

కరీంనగర్‌కు దక్కని ‘పద్దు’ ఊరట

image

KNRకు బడ్జెట్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. స్మార్ట్ సిటీకి నిర్మలమ్మ ‘పద్దు’ కరుణించలేదు. ఏళ్ల తరబడి ఊరిస్తున్న హసన్‌పర్తి రైల్వే లైన్, గ్రానైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై స్పష్టత కరువైంది. టెక్స్‌టైల్ రంగానికి కొంత ఊరట ఉన్నా, జిల్లాకు ప్రత్యేక పారిశ్రామిక కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ నిరాశ కల్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

News February 2, 2026

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలలో బరిలో 698 మంది

image

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. మొత్తం 60 డివిజన్లలో 698 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. వీరు దాఖలు చేసిన 1,231 సెట్ల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. నగరంలో కొత్తగా విలీనమైన 6వ డివిజన్‌ (బొమ్మకల్‌) లో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 32, 49వ డివిజన్లలో అత్యల్పంగా ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు.