News August 12, 2025
ఆదాయ పరిమితిని బట్టి రిజర్వేషన్లు.. మీ కామెంట్

SC, ST, BC రిజర్వేషన్లలో అంతర్గత ఆదాయ పరిమితి విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయా కులాల్లో డబ్బున్నోళ్లకు రిజర్వేషన్లు ఎందుకన్నదే పిటిషన్ ప్రధానోద్దేశం. BCల్లో క్రీమిలేయర్ ఇలాంటిదే. అయితే SC, STల్లోనూ సంపన్నులకు కాకుండా పేదలకే ఈ ఫలాలు దక్కాలన్నది పిటిషనర్ల వాదన. దీనిపై మీరేమంటారు? కొన్నేళ్లయ్యాక రిజర్వేషన్లు వద్దన్న అంబేడ్కర్ ఆశయాన్ని ఈ వాదన నెరవేర్చేనా?
Similar News
News August 13, 2025
గూగుల్ క్రోమ్ కోసం ‘పెర్‌ప్లెక్సిటీ AI’ భారీ ఆఫర్

GOOGLE క్రోమ్ కోసం పెర్‌ప్లెక్సిటీ AI సంస్థ 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ బ్రౌజర్‌కు అది చాలా తక్కువ కావొచ్చు. కానీ, పెర్‌ప్లెక్సిటీకి చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారో కూడా వెల్లడించలేదు. ఆన్‌లైన్ సెర్చ్‌లో గుత్తాధిపత్యం సరికాదని.. క్రోమ్‌ను అమ్మేయాలని గతేడాది US కోర్ట్ సూచించింది. దానిపై ఆ సంస్థ పోరాడుతుంది గానీ, బ్రౌజర్‌ని అమ్మదని నిపుణులు చెబుతున్నారు.
News August 13, 2025
హైదరాబాద్‌లో మొదలైన వర్షం

హైదారాబాద్‌లో వర్షం మొదలైంది. వాతావరణ నిపుణులు చెప్పినట్లుగానే అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్షం కురవడం ప్రారంభమైంది. ఈశాన్య భాగం నుంచి వర్షం మొదలైంది. 3 గంటల కల్లా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
News August 13, 2025
ఆల్ట్‌మన్-మస్క్.. ఎవరు నమ్మదగిన వ్యక్తి?

OPEN AI CEO శామ్ ఆల్ట్‌మన్‌ని ఎలాన్ మస్క్ తనదైనశైలిలో ట్రోల్ చేశారు. ‘ఆల్ట్‌మన్, మస్క్‌లో ఎవరు నమ్మదగిన వ్యక్తి?’ అని ChatGPTని అడిగారు. అదేమో ఎలాన్ మస్క్ అని చెప్పింది. ఆ విషయాన్ని ‘X’లో పోస్ట్ చేశారు. కొసమెరుపేంటంటే కామెంట్స్‌లో ఓ యూజర్ Grokని అదే ప్రశ్న అడగ్గా.. అది మాత్రం ఆల్ట్‌మన్ పేరు చెప్పింది. మొత్తానికి ఎవరు తయారు చేసిన AIలు వారినే నమ్మట్లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.