News August 12, 2025

నేడు విజయవాడ రానున్న హీరోయిన్ అనుపమ

image

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నేడు మంగళవారం విజయవాడ రానున్నారు. తాను నటించిన ‘పరదా’ చిత్ర ప్రమోషన్స్ నిమిత్తం ఆమె ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. మూవీ ప్రమోషన్స్ అనంతరం రాత్రి 10 గంటలకు ఈట్ స్ట్రీట్‌ను అనుపమ సందర్శిస్తారన్నారు. కాగా ఈ నెల 22న పరదా చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News April 18, 2026

‘అల్లూరి జిల్లాలో పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తాం’

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి జరుగుతుందని సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు అన్నారు. రంపచోడవరంలో విద్యాశాఖ అధికారులతో శనివారం సమావేశం జరిగింది. జిల్లాలో ఏ పాఠశాలలకు భవనాలు, మరుగుదొడ్లు, నీరు తదితర సదుపాయాలు అవసరమో నివేదిక అందజేయాలని MEO‌లను ఆయన ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య, ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు పాల్గొన్నారు.

News April 18, 2026

చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

image

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.

News April 18, 2026

నేర నియంత్రణే లక్ష్యం: జిల్లా ఎస్పీ

image

పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఎస్పీ సతీశ్ కుమార్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సమాజానికి హాని కలిగించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారు.