News August 12, 2025

మైత్రివనం.. బురదలో భవనం

image

భారీ వర్షాలకు మైత్రివనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ సెల్లార్లలోకి వరద నీరు, వ్యర్థాలు వచ్చి చేరాయి. నీటిని తొలగించి చేతులు దులుపుకున్న అధికారులు వ్యర్థాల గురించి పట్టించుకోవడం లేదు. సెల్లార్లలో ఎక్కడా చూసినా అపరిశుభ్రతనే. దుర్వాసనతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. CM ఇన్‌స్పెక్షన్ చేసిన ఏరియాలోనూ నిర్లక్ష్యం ఏంటని నిలదీస్తున్నారు. ఇకనైనా వ్యర్థాలను తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు.

Similar News

News September 14, 2025

JNTUలో పార్ట్ టైం PhD కోసం ప్రవేశ పరీక్షలు

image

జేఎన్టీయూ యూనివర్సిటీలో పార్ట్ టైం PhD కోసం పరీక్షలు జరుగుతున్నాయి. నేడు ఉదయం కంప్యూటర్ సైన్స్‌ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం మెకానికల్ తోపాటు EEE విభాగంలోని కోర్సులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు వెల్లడించారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News September 14, 2025

HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

image

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.

News September 14, 2025

GHMC వెథర్ రిపోర్ట్ @ 10AM

image

జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉండి.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30- 40KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠం 23°C ఉండే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ఠం 29.0°C, కనిష్ఠం 22.2°Cగా నమోదైంది.