News August 12, 2025
విశాఖ జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్

విశాఖలో మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డిఎంహెచ్ఓ జగదీశ్వర రావు పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్ ఇవ్వనున్నారు.
Similar News
News August 13, 2025
విశాఖ: ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరేంధీర ప్రసాద్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. కాంట్రాక్టుల పనితీరుపై సమీక్షించారు.
News August 13, 2025
విశాఖ: అంతర్జాతీయ క్రీడాకారుడికి ఆహ్వానం

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని(గవర్నర్ బంగ్లా)లో జరగనున్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీకాకుళానికి చెందిన అంతర్జాతీయ వాలీబాల్ ఛాంపియన్ అట్టాడ చరణ్‌కు ఆహ్వానం అందింది.
ప్రస్తుతం అట్టాడ చరణ్ విశాఖపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అకాడమీలో శిక్షణ పొందుతూ గాజువాక వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆహ్వానం లెటర్‌ను చరణ్‌కు అందజేశారు.
News August 12, 2025
విశాఖ: ‘ఆధార్ సీడింగ్ లోపాలను సరిదిద్దాలని ఆదేశం’

ఆధార్ సీడింగ్ లోపాలను సరిదిద్దాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F)
ఛైర్మన్ సత్యనారాయణ ఆదేశించారు. కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటరమణ ఫిర్యాదుపై మంగళవారం వర్చువల్ విచారణ జరిగింది. విచారణలో ఫిర్యాదుదారు వెంకటరమణ మాట్లాడుతూ.. ఆధార్ సీడింగ్ పొరపాట్లు వల్ల పలువురు పేదలు ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారని తెలిపారు.