News August 12, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అజారుద్దీన్‌కే టికెట్?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో INC టికెట్ దాదాపు అజారుద్దీన్‌కే ఖరారు అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అజ్జు భాయ్ అనుచరుల సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక మీద చర్చ జరిగిందని, టికెట్‌ను అజారుద్దీన్‌కే ఫైనల్ చేస్తారని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
JNTUలో పార్ట్ టైం PhD కోసం ప్రవేశ పరీక్షలు

జేఎన్టీయూ యూనివర్సిటీలో పార్ట్ టైం PhD కోసం పరీక్షలు జరుగుతున్నాయి. నేడు ఉదయం కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం మెకానికల్ తోపాటు EEE విభాగంలోని కోర్సులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు వెల్లడించారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
News September 14, 2025
HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
News September 14, 2025
GHMC వెథర్ రిపోర్ట్ @ 10AM

జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉండి.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30- 40KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠం 23°C ఉండే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ఠం 29.0°C, కనిష్ఠం 22.2°Cగా నమోదైంది.