News March 31, 2024

రేపు కవిత పిటిషన్‌పై విచారణ

image

TG: BRS MLC కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రేపు విచారించనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె గతంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. దీంతో రేపు కోర్టులో కవితకు ఊరట లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News April 3, 2026

₹2000CR లోన్: పవర్ సప్లై మెరుగుకు చర్యలు

image

AP:మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం AP పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ₹2000 కోట్ల ప్రత్యేక టర్మ్ లోన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందే ఈ రుణానికి గ్యారంటీని ఇవ్వనుంది. APPFCL అందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ నిధులను అందించనుంది.

News April 3, 2026

ధురంధర్-2 సంచలనం.. ₹1,500 కోట్లు దాటిన కలెక్షన్లు

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్-2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. రిలీజైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇండియాలో ₹1,134 కోట్లు, విదేశాల్లో ₹367 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు నటించారు.

News April 3, 2026

నాశనం చేయాలని చూస్తే శాసనం చేశాం: CBN

image

AP: అమరావతి రాజధానిని YCP నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని CM చంద్రబాబు అన్నారు. ‘అమరావతి చట్టబద్ధత బిల్లుతో గుర్తింపు, గౌరవం దక్కాయి. VJA-GNT మధ్య రాజధానికి అనుకూలమని 46% మంది ప్రజలు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ TDP సిద్ధాంతం. రాజధాని ఉంటేనే APకి భవిష్యత్ ఉంటుందని సంకల్పించి రాష్ట్రానికి మధ్యలో ఏర్పాటు చేశాం. నాకున్న అనుభవం వల్ల TGలోని 7 మండలాలను విలీనం చేయించాం’ అని తెలిపారు.