News August 12, 2025
చిన్న మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది!

ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే పెద్ద హీరోలతో ₹వందల కోట్లు వెచ్చించి సినిమా తీసి, టికెట్ ధరలు పెంచుకున్నా ₹200 కోట్లు రాబట్టడం గగనమైపోతోంది. అలాంటిది ఏ హడావిడి లేకుండా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని ₹15కోట్లతో రూపొందించగా ఇప్పటికే ₹225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. క్వాలిటీ ప్రజెంటేషన్ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుందని ఇది నిరూపించింది.
Similar News
News August 13, 2025
భార్యకు తోడుగా ఉండేందుకు రూ.1.2కోట్ల జాబ్ మానేశాడు!

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి గర్భవతి అయిన భార్యకు తోడుగా ఉండేందుకు రూ.1.2కోట్ల వార్షిక వేతనం వచ్చే ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఆయన రెడిట్‌లో పోస్ట్ చేశారు. ‘నేను ఓ కాలేజీ డ్రాపౌట్. ఏడేళ్లలోనే రూ.7 కోట్లు సంపాదించా. నా భార్యను ఉద్యోగం మానేసి రెస్ట్ తీసుకోవాలని చెప్తే ఆమె వినలేదు. అందుకే నేనే జాబ్ వదిలేశా. తన డెలివరీ తర్వాత నా అనుభవం & పరిచయాలతో మళ్లీ ఉద్యోగం సంపాదిస్తా’ అని పేర్కొన్నారు.
News August 13, 2025
విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డి

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో కోర్టు విచారణ ప్రారంభించింది. కాగా గత నెల 20 నుంచి మిథున్ రాజమండ్రి జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.
News August 13, 2025
వార్-2 X కూలీ.. దేనికి వెళ్తున్నారు?

భారీ బడ్జెట్ సినిమాలైన వార్-2, కూలీ రేపు విడుదలకానున్నాయి. ఇవి డైరెక్ట్ తెలుగు సినిమాలు కాకపోయినా వార్-2లో ఎన్టీఆర్, కూలీలో నాగార్జున నటిస్తుండటంతో వీటిపై మన దగ్గర హైప్ పెరిగిపోయింది. అందుకు తగ్గట్టు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలనూ పెంచేశారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభమవగా ప్రీసేల్స్‌లో రెండూ దూసుకెళ్తున్నాయి. మరి మీరు ఏ మూవీకి వెళ్తున్నారు? తొలి రోజు ఎన్ని కోట్లు వస్తాయో కామెంట్ చేయండి.