News August 12, 2025
విశాఖ డెయిరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి: CITU

విశాఖ డెయిరీ కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి RKSV కుమార్ అన్నారు. తొలగించిన 305 మందిని విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మికులు GVMC గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 24 గంటల దీక్ష మంగళవారం విరమింపజేశారు. ఈ పోరాటం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్మికులను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
Similar News
News April 18, 2026
నేడు 2 మ్యాచులు.. SRHపై ధోనీ ఆడతారా?

IPLలో ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. 3.30PMకు ఢిల్లీ, బెంగళూరు తలపడనున్నాయి. ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచి RCB జోరు మీద ఉండగా, చివరి 2 మ్యాచుల్లో ఓడి DC కష్టాల్లో ఉంది. మరోవైపు 7.30PMకు SRH, CSK మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరుజట్లూ చెరో 2 గెలిచి, 3 ఓడాయి. అయితే వరుసగా 2 మ్యాచుల్లో గెలవడం, ధోనీ ఆడే అవకాశం ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మరోవైపు SRH బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలింగ్‌లో తేలిపోతోంది.
News April 18, 2026
దోమకొండ: పురాతన మహాదేవుని ఆలయాన్ని దర్శించారా?

దోమకొండ సంస్థానంలోని కామినేని వంశస్థులు నిర్మించిన మహా దేవుని పురాతన ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయం కాకతీయుల వాస్తుశిల్పిని పోలి ఉంటుంది. దోమకొండ కోట నిర్మాణం జరిగిన సమయంలోనే క్రీ.శ.18వ శతాబ్దంలో నిర్మించారు. గర్భాలయం, నంది విగ్రహం, శిల్పకళ నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు పేరు కలిగిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక ప్రశాంతతకు అనువైన స్థలం.
News April 18, 2026
వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా బిల్లు?

మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి లోక్‌సభ ముందుకు కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.


