News August 12, 2025
KNR: ‘నూతన భవనం వినియోగంలోకి తేవాలి’

కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల(సైన్స్ వింగ్)ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మరమ్మతు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. కళాశాలలోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ వెంకటరమణచారి ఉన్నారు.
Similar News
News August 13, 2025
KNR: ‘డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం 5వ వార్షికోత్సవం సందర్భంగా SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఇక్కడ ఎన్సీసీ కేడేట్స్, విద్యార్థులతో కలిసి మాధక ద్రవ్యాలు నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం నషాముక్తభారత్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
News August 13, 2025
KNR: ‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

కొత్తపల్లి మండలం ఎలగందుల పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల రిజిస్టర్ ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నూరు శాతం మందికి ఆరోగ్య మహిళ పరీక్షలు చేయించాలని ఆదేశించారు.
News August 13, 2025
కరీంనగర్‌లో రేపు JOB MELA

జిల్లాలోని నిరుద్యోగులకు FLIPKARTలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. రేపు ఉ. 11 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. SSC, ఆపై విద్యార్హత కలిగినవారు, 18-45 ఏళ్లవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9000266335, 7799661512, 9908230384, 7207659969లకు కాల్ చేయొచ్చు. నెల జీతం రూ.20,000- రూ.25,000 వరకు ఉంటుంది.