News August 12, 2025
హైదరాబాద్ భవిష్యత్తు ఎటు పోతుంది?

నేటి భారతావని యువకులది. కానీ.. రియాల్టీలో కొందరు గంజాయితాగి HYDలో సృష్టిస్తున్న ఆగడాలు కళ్ల ముందే ఉన్నాయి. తాత్కాలిక ఆనందాలకు మరికొందరు మత్తులో తేలుతున్నారు. టీనేజ్‌లో లవ్ ఫెయిల్ అని, ఫ్రెండ్స్‌తో సరదాకని అలవాటు చేసుకుని భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. ‘యంగ్ ఏజ్‌లోనే మన సక్సెస్ వల్ల సమాజంలో పేరెంట్స్‌కు అందే గౌరవం ఇచ్చే కిక్కుకంటే ఈ మత్తులో ఏముంది బ్రో ఆలోచించండి’.
నేడు ఇంటర్నేషనల్ యూత్ డే
Similar News
News April 18, 2026
లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
News April 18, 2026
గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
News April 18, 2026
కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిశీలనకు 43 రోజుల గడువు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాల విశ్లేషణకు రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


