News August 12, 2025
HYD: నార్సింగిలో బీటెక్ విద్యార్థిని సూసైడ్

HYD నార్సింగి PS పరిధిలో ఓ బీటెక్ విద్యార్థిని ఈరోజు సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న సుస్మిత(19) ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్‌లోనే ఉరేసుకుని చనిపోయింది. సుస్మిత స్వస్థలం నిజామాబాద్ జిల్లా అక్కునూరుగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలా..?, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 18, 2026
అప్పుల్లో గేల్.. తానే సాయం చేశానన్న లలిత్ మోదీ

2011 ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన గేల్‌ను జట్టులోకి తీసుకొమ్మని RCBకి చెప్పింది తానేనని IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు. ‘వేలంలో గేల్ అమ్ముడుపోలేదు. ఎన్ని ఫ్రాంచైజీలను సంప్రదించినా నో అన్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పులున్నాయి.. ఎలాగైనా ఆడాలని అన్నాడు. ఇంజూరీ ప్లేయర్ స్థానంలో తీసుకొమ్మని విజయ్ మాల్యాను రిక్వెస్ట్ చేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2011లో గేల్ 608 రన్స్ చేశారు.
News April 18, 2026
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని CM వినతి

MHBD బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని CM రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం, పర్యావరణ హితంగా ఉక్కు ఉత్పత్తి చేసే పరిశ్రమల ఆవశ్యకతను వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
News April 18, 2026
రాముని బండ.. తెలంగాణలో మూడవ భద్రాద్రి!

జగదేవ్‌పూర్ మండలం జంగంరెడ్డిపల్లి సమీపాన కొలువైన ‘రాముని బండ’ శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రం మహిమాన్విత పుణ్యస్థలిగా వెలుగొందుతోంది. భద్రాచలం, జీడికల్లు తర్వాత శ్రీరాముడు స్వయంభువుగా వెలసిన మూడవ క్షేత్రం ఇదే కావడం విశేషం. పూర్వం సీతమ్మ దాహం తీర్చేందుకు రాముడు బాణంతో ఉద్భవింపజేసిన ఇక్కడి ‘రామగుండం’లోని నీరు ఎన్నటికీ ఎండిపోదు. ఇక్కడ స్నానం చేస్తే పిల్లల్లో శారీరక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మకం.


