News August 12, 2025

ఆ సర్వేతో ఒంగోలుకు రూ.50కోట్లు: కమిషనర్

image

ఒంగోలు నగరంలో నక్ష సర్వేను 30 రోజుల్లో సచివాలయాల సెక్రటరీలు పూర్తి చేయాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో నక్ష సర్వే తీరుపై కమిషనర్ సమీక్షించారు. ఈ సర్వే పూర్తి చేసిన వెంటనే నగరపాలక సంస్థకు కేంద్రం రూ.50 కోట్ల ప్రోత్సాహకంగా అందజేస్తుందన్నారు. ఈ విషయాన్ని గమనించి సిబ్బంది పక్కాగా పనిచేయాలని కోరారు.

Similar News

News August 14, 2025

దోర్నాలలో చిన్నారిపై చిరుత పులి దాడి

image

దోర్నాల మండలం చిన్నారుట్ల గిరిజన గూడెంలో ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిపై చిరుత పులి దాడి చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తమై కేకలు వేయడంతో పాపను విడిచి వెళ్లిపోయింది. అర్ధరాత్రి సమయంలో చిరుత పులి పాపపై దాడి చేయడంతో తల, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు సున్నిపెంట వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

News August 14, 2025

ప్రకాశం జిల్లాలోని కంది సాగు రైతులకు శుభవార్త.!

image

ప్రకాశం జిల్లాలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధానంగా కంది సాగు చేసే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థితిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం Way2Newsకు పలు విషయాలు వెల్లడించారు. సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 70 వేల హెక్టార్ల కంది సాగవుతుందన్నారు. ప్రస్తుతం 40 శాతం సబ్సిడీపై కంది విత్తనాలు ఇవ్వనున్నట్లు, రైతులు RSK కేంద్రాలను సంప్రదించాలన్నారు.

News August 14, 2025

మార్కాపురం జిల్లా ఓకే.. మిగిలిన వీటి సంగతేంటి?

image

సీఎం చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే మంత్రుల కమిటీ దీనిపై దృష్టి సారించింది. మార్కాపురం జిల్లా ఖాయమన్న వార్తలు గుప్పుమంటుండగా, కందుకూరు పరిస్థితి ఏమిటన్న చర్చలు జోరందుకున్నాయి. ఇలా కందుకూరును కలిపేస్తారా? లేక అద్దంకిని ఒంగోలులోకి మిళితం చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదొక డివిజన్‌ను కలిపితే ప్రకాశం నిండుగా ఉంటుందన్నది ప్రజల వాదన.