News August 12, 2025
అటవీ సంరక్షణలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

అటవీ సంరక్షణలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన అటవీ సంరక్షణ చర్యలపై నేడు సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ సంపద, వన్యప్రాణి సంరక్షణ, అక్రమ ఆక్రమణల నివారణ, ఎకో టూరిజం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై పటిష్ఠ పర్యవేక్షణ చేయాలన్నారు.
Similar News
News April 17, 2026
కడపలో సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు

కడపలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజ రాజేశ్వర్ రెడ్డిలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరినీ విధుల్లో నుంచి తప్పించి కర్నూలు వీఆర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవల జరిగిన కొన్ని వివాదాస్పద అంశాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ బదిలీలు జరిగినట్లు చర్చ నడుస్తోంది.

విశాఖ: 5 నిమిషాల ముందే పట్టాలెక్కనున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు వాల్తేరు డివిజన్ రైళ్ల సమయాలను మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. జూన్ 18 నుంచి 18503 రైలు ఉదయం 08:15కు, 12739 రైలు రాత్రి 20:35కు బయలుదేరుతాయి. అలాగే జూన్ 19 నుంచి 12803 రైలు ఉదయం 08:15కు బయలుదేరుతుంది. ప్రయాణికులు వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.