News August 12, 2025
KU డిగ్రీ RESULTS వచ్చేశాయ్!

మే నెలలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ రెగ్యులర్ 1, 2, 3, 4 సెమిస్టర్ పరీక్షలతో పాటు, దూర విద్య డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. వర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చన్నారు. మొదటి సెమిస్టర్‌లో 31%, 2లో 30, 3లో 35, 4లో 39, దూరవిద్య మొదటి సెమిస్టర్‌లో 24% మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 19, 2026
హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

ఉప్పల్ స్టేడియంలో తండ్రీకొడుకుల డ్యూటీ

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎస్‌బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు ట్రైనీ డీఎస్సీ శంతన్ కుమార్ రెడ్డి ఒకే చోట విధులు నిర్వహించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పోలీసు శాఖలో ఉండటంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది వారిని అభినందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అధికారులు ఒకే కార్యక్రమంలో విధులు నిర్వర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.