News August 12, 2025

WOW.. మూడు రోజుల్లో 343L పాలిచ్చిన ఆవు

image

బ్రెజిల్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రైసియన్ జాతి ఆవు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సాధారణ ఆవులు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంటే ఇది మాత్రం సగటున రోజుకు 114 లీటర్ల చొప్పున 3 రోజుల్లో 343L పాలు ఉత్పత్తి చేసింది. జెనెటిక్స్, సరైన పోషణ, సంరక్షణ, మోడ్రన్ డెయిరీ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముర్రా & నీలి-రవి గేదెలు కూడా ఈ జాతిలానే ఎక్కువ పాలు ఇవ్వగలవు.

Similar News

News August 14, 2025

జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదు అయ్యిందంటే?

image

AP: నిన్న కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరు మం.లో 27.24 సెం.మీ., గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4, దుగ్గిరాలలో 22.58, తాడికొండలో 22.50, మంగళగిరిలో 19.48, నాగాయలంకలో 19.1, పెదకాకానిలో 18.68, తుళ్లూరులో 18.02, తెనాలిలో 17.84, కోనసీమ జిల్లా డి.ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర్రులో 14.3, NTR జిల్లా నందిగామలో 13.3, ప.గో.జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

News August 14, 2025

RED ALERT: అత్యంత భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కొనసాగుతున్నాయి. APలోని అల్లూరి, కోనసీమ, ఏలూరు, NTR, GNT, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. TGకి ఇవాళ కూడా RED ALERT జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, KMM, SPT, యాదాద్రి, VKB, సంగారెడ్డి, MDK జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.

News August 14, 2025

భారత్‌పై ట్రంప్ వైఖరి తప్పు: US Ex NSA

image

భారత్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోల్టన్ తప్పుబట్టారు. ‘రష్యా ఆయిల్ కొంటున్నారన్న సాకుతో ఇండియాపై 25%(ఓవరాల్ 50%) అదనపు టారిఫ్స్ వేయడం తప్పు. చైనాకు ఎందుకు అలాంటి సుంకాలు విధించలేదు? ట్రంప్ చర్యలతో అమెరికా మళ్లీ భారత్ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం. నా సలహా ఏంటంటే.. భారత్ కూడా పాక్‌లా ట్రంప్‌ని నోబెల్‌ కోసం సిఫార్సు చేయాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు.