News August 12, 2025

YS జగన్‌కు రాఖీ కట్టిన కాకాణి పూజిత

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాకాణి పూజిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి రాఖీ కట్టారు. అనంతరం మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు ఆమె జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News August 13, 2025

నెల్లూరులో యువకుడి దారుణ హత్య

image

నెల్లూరు అలంకార్ సెంటర్ సమీపంలోని విక్టోరియా గార్డెన్ వద్ద మూలాపేటకు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సూరి, లక్కీ అనే ఇద్దరు యువకులు ప్రాణ స్నేహితులు. ఇటీవల వీరిద్దరి మధ్య కొంత వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే లక్కీ అనే యువకుడిని సూరి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

News August 13, 2025

LRS సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్

image

జూన్ 30, 2025 కంటే ముందు అనధికారంగా ఏర్పాటైన లేఅవుట్లు, ప్లాట్లను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించే సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని మండల తహశీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, నుడా (NUDA) కార్యాలయాలను సంప్రదించాలన్నారు. http://apdpms.ap.gov.in/ లేదా http://nudaap.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News August 13, 2025

యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్ – 1 న్యాయనిర్ణితగా కలిగిరి వాసి

image

నెల్లూరు జిల్లా కలిగిరి అంబేడ్కర్ నగర్‌కు చెందిన గోసాల మహేశ్ బాబు(బాబి) యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్ – 1 రిఫరీ(న్యాయనిర్ణేత) గా ఎంపికయ్యారు. గోసాల రామచంద్రయ్య, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు బాబి పేదింటి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరుగు యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్- 1 కి రిఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యలమంచలి శ్రీకాంత్ తెలిపారు.