News August 12, 2025

కలెక్టర్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు: KMR కలెక్టర్

image

రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. వర్షాల వల్ల ఏమైన సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08468-220069ను సంప్రదించాలన్నారు. ప్రజలు అధికార యంత్రాంగ అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News April 16, 2026

అందరి చూపూ పార్లమెంట్ సమావేశాలపైనే..

image

ఎన్నడూ లేనంతగా యావత్ దేశం పార్లమెంట్ సమావేశాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడమే అందుకు కారణం. మహిళా బిల్లుకు అందరూ ఓకే అంటున్నా డీలిమిటేషన్‌ను మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాసేపట్లో కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును LSలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరగనుంది. సాయంత్రం PM మోదీ ప్రసంగిస్తారు.

News April 16, 2026

రాజంపేట మండలంలో దారుణ హత్య

image

రాజంపేట మండలం పులపుత్తూరులో గత రాత్రి దంపెట్ల మల్లిఖార్జున (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తల వెనుక బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వారు బండరాయితో దాడి చేయడంతో తల వెనుక బలమైన గాయం తగిలి గ్రామం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 16, 2026

జగిత్యాలలో కేసీఆర్ సభ తర్వాత కాంగ్రెస్ సభకు ప్లాన్..?

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈనెల 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే, జగిత్యాలలో కేసీఆర్ సభ ఏర్పాటు జరుగుతుండగా, బీఆర్ఎస్‌లో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉరకలెత్తుతుంది. ఇటీవల సీఎంను జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిసిన సందర్భంలో త్వరలోనే జగిత్యాలకు వస్తానని సీఎం పేర్కొనడం బీఆర్ఎస్ సభ తర్వాత కాంగ్రెస్ సభకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.