News August 12, 2025

వనపర్తి: ఆసుపత్రిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం

image

వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గతంలో టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న వనపర్తి ఇప్పుడు 12వ స్థానానికి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న వైద్య పరీక్షలు చేయలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

ఎండల సెగ.. కళ్లు జాగ్రత్త!

image

తీవ్ర ఎండలు, వేడి గాలుల వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. డ్రై ఐస్, అలర్జీలు, కంటి కలకలు కామన్‌గా కనిపిస్తున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగాలని, బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కళ్లను రుద్దకూడదు. విశ్రాంతి ఇవ్వాలి. క్యారెట్, బొప్పాయి లాంటి విటమిన్-A ఫుడ్స్ తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే సొంత వైద్యం కాకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.

News April 16, 2026

కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ కాలేజ్ లో ఇంటర్ ఫలితాలు ఇలా..?

image

* ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1st Year 50%, 2nd Year 56%
* అవనిగడ్డ కళాశాలలో 1st Year 57%, 2nd Year 67%
* బంటుమిల్లి కళాశాలలో 1st Year 63%, 2nd Year 74%
* మచిలీపట్నం లేడియాంప్తిల్ లో 1st Year 82%, 2nd Year 94%
* మొవ్వ కళాశాలలో 1st Year 76%, 2nd Year 89%
* పామర్రు కళాశాలలో 1st Year 66%, 2nd Year 92%
* పెడన కళాశాలలో 1st Year 49%, 2nd Year 67%
* రుద్రపాక కళాశాలలో 1st Year 38%, 2nd Year 48%

News April 16, 2026

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం: అసద్

image

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెంచుతూ చేపట్టే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థకు ఇది విరుద్ధంగా ఉందని దుయ్యబట్టారు. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.