News March 31, 2024
పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..(1/2)

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ-ఉత్తమ్, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్ బాబు, వరంగల్-ప్రకాశ్ రెడ్డి, మహబూబాబాద్-నాగేశ్వర రావు, హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Similar News
News March 21, 2026
ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు: రాజమౌళి

‘ధురంధర్-2’ 4 గంటల నిడివి ఉన్నా ఆడియన్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఇంతటి లెన్త్ ఉన్న మూవీని రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని చెప్పారు. తనకు ధురంధర్ నచ్చిందని, ధురంధర్-2 అంతకంటే బాగుందని కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. రణ్‌వీర్, మాధవన్ నటనలో మాస్టర్ క్లాస్ చూపించారన్నారు.
News March 21, 2026
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.
News March 21, 2026
ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నావ్ రేవంత్: హరీశ్ రావు

TG: సిద్దిపేట జిల్లా నర్మెట్టకు రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ‘మీరు ప్రారంభించే పనులు కాంగ్రెస్ చేసినవి కావు. శ్రమ మాది శిలాఫలకాలు కాంగ్రెస్‌వి. ఆయిల్ ఫామ్‌కు ప్రాణాధారం కాళేశ్వరం ప్రాజెక్టే. దానిపై మీ వైఖరి మార్చుకోవాలి. 3 పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేట వస్తున్నారు’ అని హరీశ్ ప్రశ్నించారు.


