News August 12, 2025
VKB: ‘చిన్నారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి’

2025-26 విద్యా సంవత్సరానికి ఎస్టీ పేద విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశం కోసం నలుగురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ సుదీర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశం కోసం డ్రా తీశారు. హర్షవర్ధిని, సాయి, ప్రతిక్ష, వైభవ్, అభినందన్ ఎంపికయ్యారు.
Similar News
News April 17, 2026
ప్రతీ ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: VZM కలెక్టర్

ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా కోటలో శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లఘు ఉద్యోగ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సీఐటీడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
NZB: కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి 08462-220183 నంబర్‌కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.
News April 17, 2026
సింగరేణిపై గల్ఫ్ సెగ.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

గల్ఫ్ యుద్ధ పరిణామాలతో సింగరేణి సంస్థకు ముడిసరుకు కష్టాలు మొదలయ్యాయి. బ్లాస్టింగ్ మెటీరియల్, డ్రిల్ రాడ్లు, డిటొనేటర్ల దిగుమతి నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, సవరించిన రేట్ల ప్రకారం ఒప్పందాలు చేసుకుంటేనే సరఫరా చేయగలమని కాంట్రాక్టర్లు Way2Newsకు వివరించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు, సరుకు సరఫరా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.


