News March 31, 2024
ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ!

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ప్రేమలు’ OTT రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను ఇటీవల తెలుగులో రిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టింది. గిరీశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశారు. తొలుత మార్చి 29 నుంచే స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది.
Similar News
News March 19, 2026
రేవంత్‌కు పాలనాపరంగా ఇబ్బందుల్లేవు.. పంచాంగ శ్రవణం

TG: నూతన సంవత్సరంలో వాణిజ్యం పంటలు సమృద్ధిగా పండుతాయని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోశ్ కుమార్ వెల్లడించారు. రైతులు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. TPCC చీఫ్ మహేశ్ గౌడ్ నూతన పదవులు చేపడతారని పేర్కొన్నారు.
News March 19, 2026
మే 20న ‘ఊసరవెల్లి’ రీరిలీజ్

సురేందర్ రెడ్డి-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో బర్త్ డే సందర్భంగా మే 20న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఎన్టీఆర్ స్టైలిష్ యాక్షన్, సాంగ్స్, విభిన్నమైన కథాంశం కారణంగా ఫ్యాన్ ఫేవరెట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించారు.
News March 19, 2026
గ్యాస్, క్రూడ్ డేటా ఇవ్వండి.. ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశం

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చమురు, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన డేటాను తమకు ఇవ్వాలని ఆదేశించింది. దీని ఆధారంగా సప్లై చెయిన్‌ను మరింత సమర్థంగా పర్యవేక్షించడమే లక్ష్యమని పేర్కొంది.


