News March 31, 2024

ఏప్రిల్ 5న కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారైంది. కరీంనగర్ రూరల్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడనున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 7, 2026

రేపే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

image

అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్-న్యూజిలాండ్ మధ్య T20WC ఫైనల్ జరగనుంది. దీంతో ప్రైజ్ మనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీ కోసం ICC మొత్తం ₹120Crను కేటాయించింది. విజేతకు ₹27.48Cr, రన్నరప్‌కు ₹14.65Cr అందుతాయి. సెమీస్‌లో ఓడిన SA, ENGకు ₹7.24Cr చొప్పున, సూపర్-8 వరకు వచ్చిన జట్లకు ₹3.48Cr, టోర్నీలో పాల్గొన్న 20 టీమ్స్‌కు ₹2.29Cr చొప్పున ఇవ్వనుంది.
* రేపటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News March 7, 2026

డయాబెటిస్ రిస్క్ తగ్గాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?

image

డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించాలంటే రోజూ రాత్రి 7గంటల 18నిమిషాలు నిద్రపోవాలని తాజా స్టడీ వెల్లడించింది. BMJ ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ జర్నల్‌ ప్రకారం.. ఈ నిర్ణీత సమయం కంటే కాస్త అటూఇటుగా తక్కువ లేదా ఎక్కువ నిద్రపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌పై ప్రభావం పడుతుంది. ఎక్కువ సేపు నిద్రపోతే గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతినే ప్రమాదం ఉంది. నిద్ర మెటబాలిక్ హెల్త్‌ను మెరుగుపరుస్తుందని ఈ స్టడీ తేల్చింది.

News March 7, 2026

భీకర దాడి.. 47 మంది మృతి

image

ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇవాళ ష్ముస్టార్, నబీ చిట్ పట్టణాలపై చేసిన ఎయిర్‌స్టైక్స్‌లో 47 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది పౌరులేనని తెలిపింది. మరో 40 మంది గాయపడినట్లు పేర్కొంది. కాగా 2023 OCT నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 4వేల మందికి పైగా మరణించగా, దాదాపు 17వేల మంది గాయపడినట్లు సమాచారం.