News August 12, 2025
కడప: కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. పులివెందులలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానం చేసి సీసీ కెమెరాల ఫుటేజీని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. తుమ్మలపల్లి, నల్లపురెడ్డిపల్లి, కొత్త మాధవరం, ఒంటిమిట్ట ప్రాంతాల పోలింగ్ సరళిని ఇక్కడినే వీక్షించి పోలీసులకు పలు సూచనలు చేశారు.
Similar News
News August 13, 2025
పులివెందుల ZPTC రీ పోలింగ్ శాతం @12 PM

పులివెందుల ZPTC ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.
అచివెల్లి(3): 33.74 శాతం.
మొత్తం ఓట్లు 492 కాగా.. ఇప్పటి వరకు 166 ఓట్లు పోలయ్యాయి.
E. కొత్తపల్లి (14): 26.71 శాతం.
మొత్తం ఓట్లు కాగా 1,273 ఓట్లు కాగా.. ఇప్పటి వరకు 340 ఓట్లు పోలయ్యాయి.
News August 13, 2025
పులివెందులలో రీ పోలింగ్ శాతం @10 AM

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.
అచ్చివెళ్లి(3): 6.71 శాతం.
మొత్తం ఓట్లు 492 కాగా.. ఇప్పటి వరకు 33 ఓట్లు పోలయ్యాయి.
E. కొత్తపల్లె(14): 11.47 శాతం.
మొత్తం ఓట్లు కాగా 1273 ఓట్లు కాగా.. ఇప్పటి వరకు 146 ఓట్లు పోలయ్యాయి.
News August 13, 2025
పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల కౌంటింగ్ ఇక్కడే.!

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రేపు జరగనుంది. కడప నగర శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు. నిన్న పోలింగ్ ప్రక్రియ ముగియగా.. పులివెందులలోని 2 చోట్ల ఇవాళ రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. పులివెందులలో 76.44, ఒంటిమిట్టలో 84.05 శాతం పోలింగ్ ముగిసేసరికి జరిగింది.