News August 12, 2025

విశాఖ: ‘ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలి’

image

ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న మహిళల ఫ్రీ బస్ పథకాన్ని వృక్ష అతిథులతో ప్రారంభించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సిబ్బంది సిద్ధం కావాలని అన్నారు. పథకం అమలులో లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News August 13, 2025

సాగర్ నగర్ బీచ్ సమీపంలో అపస్మారక స్థితిలో వ్యక్తి

image

ఆరిలోవ స్టేషన్ పరిధి సాగర్ నగర్ రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో బీచ్ దగ్గర పొదల్లో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. స్థానికులు 108 సమాచారం ఇవ్వగా కేజీహెచ్‌కి తరలించినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి పాయిజన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ వ్యక్తి బంధువులు ఎవరైనా ఉంటే ఆరిలోవ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ మల్లేశ్వరరావు సూచించారు.

News August 13, 2025

స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

విశాఖ వన్ టౌన్ ఏఆర్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. వీవీఐపీ భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కవాతును సమీక్షించారు. జెండా వందనం, వందన సమర్పణ పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, అధికారులు, ప్రజలు కూర్చునే గ్యాలరీలను పరిశీలించారు.

News August 13, 2025

VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌పై కేసు కొట్టివేత

image

VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌పై ఛలో రుషికొండ కార్యక్రమంలో పోలీసులు పెట్టిన కేసులు విశాఖ జిల్లా కోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ కొట్టివేశారు. వైసీపీ ప్రభుత్వం హయంలో ఛలో రుషికొండ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. అప్పట్లో TNSF రాష్ట్ర అధ్యక్షుడిగా రుషికొండ వెళ్లి నిరసన తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు శోభన్ బాబు, పార్థసారథి వాదనలు వినిపించారు.