News August 12, 2025

రేపటి నుంచి జాగ్రత్త

image

APలో రేపటి నుంచి 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రేపు ప.గో, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, ఎల్లుండి కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండవద్దని సూచించారు.

Similar News

News August 14, 2025

EP35: ఎవరు చెప్పినా ఈ తప్పు చేయకండి: చాణక్య నీతి

image

మనిషి ఉన్నతంగా ఎలా బతకాలి? జీవితంలో ఎలా విజయం సాధించాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘అవకాశాలు పొందాలన్నా, సక్సెస్ కావాలన్నా ఎప్పుడూ మీలోని మంచి గుణాలను మార్చుకోకూడదు. ఎవరో చెప్పారని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ పోతే ఆఖరికి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. కష్టాలను చూసి కుంగిపోకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకుని ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది’ అని చెబుతోంది.

News August 14, 2025

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాలేదా?

image

TG: బిల్లులు రాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హౌసింగ్ కార్పొరేషన్ కీలక సూచన చేసింది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. అలాంటివారు వెంటనే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించింది. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టం ద్వారానే చెల్లింపులు చేస్తామని తెలిపింది. కాగా లబ్ధిదారులు బిల్లుల స్టేటస్‌ను <>వెబ్‌సైట్‌లో<<>> చెక్ చేసుకోవచ్చు.

News August 14, 2025

నేడు బలరామ జయంతి.. ఎలా పూజించాలంటే?

image

శ్రావణ బహుళ షష్ఠి(నేడు) రోజున బలరామ జయంతిని జరుపుకుంటారు. ఉ.8గం.-ఉ.11గం. వరకు పూజకు మంచిదని పండితులు తెలిపారు. ఈరోజు బలరాముని పూజిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ‘సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి బలరామకృష్ణుల పటాలకు గంధం, కుంకుమ పెట్టుకోవాలి. పారిజాత పూలు, శంఖు, పొగడ పూలతో పూజించాలి. పాలు, వెన్న, మీగడ, అటుకులు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం ఉండాలి’ అని చెబుతున్నారు.