News August 12, 2025

రెండు నెలలపాటు అవగాహన సదస్సులు: డీఎంహెచ్ఓ

image

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లాలో మంగళవారం నుంచి రెండు నెలలపాటు లైంగికంగా సంక్రమించే హెచ్ఐవి, ఎయిడ్స్‌పై జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ హైమావతి తెలిపారు. మంగళవారం అనకాపల్లిలో ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. 8 వారాల్లో 200 గ్రామస్థాయి సమావేశాలు, 20 సైకిల్ ర్యాలీలు, 20 జానపద ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.

Similar News

News April 18, 2026

MNCL: 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పదవ తరగతిలో 654 మంది, ఇంటర్‌లో 1226 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 18, 2026

పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’కు ఓటీటీ కష్టాలు?

image

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ‘స్లమ్ డాగ్’పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ముగిసినా రిలీజ్‌ ప్రకటన వెలువడటం లేదు. దీనికి ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. డీల్ పూర్తయ్యాకే విడుదల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News April 18, 2026

ANU: ఫిజికల్ ఎడ్యుకేషన్ 1వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి నెలలో జరిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. BPEdలో 90.48%, DPEdలో 92.86%, MPEdలో 94.50% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ ఫీజు, చివరి తేదీ, వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.inను సంప్రదించాలన్నారు.