News August 12, 2025

NRPT: ‘భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’

image

భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల వద్ద పోలీసులను ఏర్పాటు చేయాలని చెప్పారు.

Similar News

News April 18, 2026

బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

image

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2026

భద్రాచలంలో నేడు జాబ్ మేళా

image

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సేల్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. ఎంపికైన వారికి రూ.15,000 నుంచి రూ.35,000 వరకు వేతనం లభిస్తుంది. 18-29 ఏళ్ల మధ్య ఉండి, పదో తరగతి నుంచి పీజీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు. మరిన్ని వివరాలకు 9989209575 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News April 18, 2026

వచ్చే సీజన్‌కు KKR కోచ్‌గా మెక్‌కల్లమ్: పీటర్సన్

image

వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ వస్తారని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అంచనా వేశారు. ఇది జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తూ తన ట్వీట్‌ను బుక్ మార్క్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022 నుంచి మెక్‌కల్లమ్ కొనసాగుతున్నారు. గతంలో KKRకు ఆడారు. మరోవైపు KKR పేలవ <<19678736>>ప్రదర్శన<<>> కొనసాగుతోంది. ఒక్క గెలుపూ లేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.