News August 13, 2025

ఆసిఫాబాద్: ‘అర్హులకు రుణ సదుపాయం కల్పించాలి’

image

జిల్లాలోని వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలు, ఇతర రంగాల అభివృద్ధి కోసం అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం చేతన్ గోరేకర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌తో కలిసి జిల్లా స్థాయి త్రైమాసిక కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణాలపై చర్చించారు.

Similar News

News April 18, 2026

భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

image

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

News April 18, 2026

జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్

image

తూప్రాన్ ఐవోసీ భవనంలో శుక్రవారం జనగణనపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బ్లాకులుగా విభజించి పకడ్బందీగా గణన చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి, MRO చంద్రశేఖర్ రెడ్డి, MPDO సతీశ్ పాల్గొన్నారు. గణన సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 18, 2026

2028లోనే TG అసెంబ్లీ ఎన్నికలు?

image

పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న LSలో వీగిపోవడంతో కేంద్రం 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలూ అసాధ్యమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, తర్వాత జమిలికి వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. కానీ డీలిమిటేషన్ కుదరకపోవడంతో దీనికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028లోనే జరగనున్నాయి.