News August 13, 2025
72 గంటలు అప్రమత్తంగా ఉండాలి: ASF కలెక్టర్

రానున్న 72 గంటలు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహశీల్దార్లు, పోలీసు అధికారులు, MPDOలు, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వారికి పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News April 16, 2026
HYD: జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ

కుటుంబ విలువలను మంటగలిపే అమానుష ఘటన మేడిపల్లి PS పరిధిలో వెలుగుచూసింది. మామకు తోటికోడలి కుమారుడిపై ఆదరణ ఎక్కువన్న అసూయతో మహిళ బాలుడికి యాసిడ్ తాగించింది. బోడుప్పల్‌కు చెందిన నాగరాజు, సంధ్యలకు కార్తీక్ వాసు(4) కుమారుడున్నాడు. ఈ నెల 9న నాగరాజు సోదరుడి భార్య మంజుల, జ్యూస్ అని కార్తీక్‌కు యాసిడ్ తాగించింది. ఇంతకు ముందూ అతడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 16, 2026
సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రదానం: కలెక్టర్

సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రదానమని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. డ్రైవర్లు కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.