News August 13, 2025
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం విద్యా శాఖ సమావేశాన్ని నిర్వహించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా టీచర్లు, విద్యార్థుల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 3రోజుల్లో ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలని, అధిక విద్యార్థులున్న 237పాఠశాలల్లో టీచర్ కొరత రాకుండా చూడాలని సూచించారు. యూడీఐఎస్‌సీ పోర్టల్‌ను 15రోజుల్లో అప్‌డేట్ చేయాలని, ప్రతి నెల బ్యాగ్‌లెస్ డే నిర్వహించాలన్నారు.
Similar News
News August 14, 2025
మున్నేరు ఉప్పొంగడంతో రాకపోకలు బంద్

ముదిగొండ మండలం పరిధిలోని పండ్రేగుపల్లి నుంచి రామకృష్ణాపురం దారిలో మున్నేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి తులసీరామ్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో ప్రజల భద్రతకు తాము పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.
News August 14, 2025
ఖమ్మం జిల్లా నేటి వార్తా సమాచారం

☆ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు
☆ జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
☆ ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు
☆ నేడు జిల్లాకు అత్యంత భారీ వర్ష సూచన
☆ ఇవాళ వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
☆ జిల్లావ్యాప్తంగా ఇవాళ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు
☆ భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
☆ ఖమ్మంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
News August 14, 2025
ఖమ్మం: భారీ వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు

ఖమ్మంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర సమయాల్లో అందించేందుకు వివిధ హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, పోలీస్ కంట్రోల్ సెల్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ 1077, సెల్ 9063211298 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.