News August 13, 2025

ADB: ఉరేసుకొని యువకుడి బలవన్మరణం

image

జిల్లాకేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో నివాసం ఉండే రాథోడ్ విక్కీ(32) మంగళవారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లి ఉరేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా బలవన్మరణానికి పాల్పడడానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Similar News

News April 20, 2026

ADB: నేటి నుంచి వారోత్సవాలు.. కలెక్టర్ ALERT

image

ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను ఈనెల 20 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఈ సంక్షేమ వారోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రణాళికబద్దంగా నిర్వహిస్తూ, నివేదికలను నమోదు చేయాలన్నారు.

News April 19, 2026

ADB: 4 క్వింటాళ్ల కోళ్ల చోరీ.. ముగ్గురి అరెస్టు

image

ఆదిలాబాద్‌లోని దస్నాపూర్‌లో కోళ్ల దొంగతనం కేసును మావల పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాత్రి సమయంలో కొందరు దుండగులు షాప్ వెనుక భాగంలో టిన్ షీట్లు కట్ చేసి లోపలికి ప్రవేశించి సుమారు 4 క్వింటాళ్ల కోళ్లను ఎత్తుకెళ్లారు. సుగుణ చికెన్ సెంటర్ యజమాని సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అమన్, ఫిరోజ్ ఖాన్, ముజాహిద్ అలీని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.