News August 13, 2025

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ డీఎంహెచ్ఓ

image

సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. నల్గొండ శివారులోని పానగల్ యూపీహెచ్‌సీని ఇవాళ ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మందుల నిల్వలను తనిఖీ చేశారు. జ్వరాల విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.

Similar News

News August 13, 2025

మాదక ద్రవ్యాల రహిత సమాజానికి కృషి: నల్గొండ SP

image

మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడితే జీవితం వృథా అవుతుందని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.

News August 13, 2025

నల్గొండ: పోక్సో నిందితుడికి జీవిత ఖైదు

image

నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నిందితుడు గ్యారాల శివకుమార్‌కి జీవిత ఖైదీ విధిస్తూ బుధవారం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. 2023లో మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేశాడనే ఆరోపణపై శివకుమార్‌పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.

News August 13, 2025

NLG: 12 గంటల్లోనే పట్టుకున్నారు..!

image

కోర్టు నుంచి తప్పించుకున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మైనర్ బాలికపై లైంగికదాడి ఘటనలో నిన్న తుది తీర్పు వెలువడిన క్రమంలో భయభ్రాంతులకు గురై నిందితుడు పారిపోయిన విషయం తెలిసిందే. నిందితుడు గ్యారాల శివకుమార్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి 12 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.