News August 13, 2025
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: NZB కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
Similar News
News August 14, 2025
NZB: ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ఏదో ఒక మండలాన్ని, ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను గోప్యంగా ఉంచడంతో డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ ఏ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియక ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News August 14, 2025
NZB: ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు రాష్ట్రానికి ముప్పు: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన NZBలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందని మండిపడ్డారు.
News August 14, 2025
NZB: ఈ నెల 17న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

నిజామాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న జిల్లా స్థాయి బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కిరణ్ కుమార్ తెలిపారు. మోపాల్‌లోని ఫిట్నెస్ క్లబ్‌లో ఉదయం 9 గంటలకు అండర్ 15, 13, 11 విభాగాల్లో ఎంపికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనేవారు 98483 51255కు ఫోన్ చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీని సంప్రదించాలన్నారు.